విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రతి ఒక్కరినీ “రణబాలి” మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రశంసించారు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రివర్యులు నారా లోకేష్. 18వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యాన్ని తెరపై ఎంతో సహజంగా ఆవిష్కరించారని, విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో ఆకట్టుకున్నారని సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
నారా లోకేష్ తన పోస్ట్ లో స్పందిస్తూ – రణబాలి సినిమా ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ అద్భుతమైన అనుభూతిని కలిగించింది. 18వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యాన్ని ఎంతో సహజంగా క్రియేట్ చేసి తెరకెక్కించారు. బ్రిటీష్ కాలంలో ఏర్పడిన కరువు ఘటనను హార్ట్ టచింగ్ గా చూపించారు. సీమ కోసం పోరాడే బిడ్డగా విజయ్ దేవరకొండ రౌద్రపూరిత నటన ఆకట్టుకుంది. రశ్మిక బ్రిలియంట్ పర్ ఫార్మెన్స్ చేశారు. చరిత్ర మరుగున పడిన ఈ అధ్యాయాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, అతని టీమ్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ నెల 16న రిలీజ్ కు వస్తున్న రణబాలి సినిమాకు ఘన విజయం దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు
======================